శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాను హిందీలో రీమేక్..
- January 25, 2016
కుటుంబ ప్రక్షకులు, యూత్ మెచ్చేలా ఫీల్ గుడ్ సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మధ్య కాలంలో శేఖర్ కమ్ముల పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన నుండి సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఆయన చేసిన చివరి చిత్రం నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన 'అనామిక'.మధ్యలో శేఖర్ కమ్ముల పలానా స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు, ఆయనకు కథ చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నడంటూ వార్తలు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు శేఖర్ కమ్ముల సినిమా ఓకే అయింది.ఈ సారి ఆయన ఏకంగా బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసాడు. మరో విశేషం ఏమిటంటే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నిర్మించబోతున్నారు. 2007లో వచ్చిన 'హ్యాపీడేస్' సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు శేఖర్ ఖమ్ముల.శేఖర్ కపూర్ - సల్మాన్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన కాలేజ్ కోసం పూణేలోని ఇంజనీరింగ్ కాలేజ్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. నటుల ఎంపికలో ప్రస్తుతం ఈ చిత్ర బృందం నిమగ్నమై ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







