సేమ్యా రవ్వలడ్డు
- January 25, 2016
కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ-ఒక కేజి, సేమ్యా-350 గ్రా, చక్కెర-రెండు కేజీలు, నెయ్యి-పావు కేజి, జీడిపప్పు-100 గ్రా, కిస్మిస్-50 గ్రా, కర్బూజ విత్తనాలు-100గ్రా, కొబ్బరి-350 గ్రా, పాలు-ఒక లీటరు, యాలకులు-10 గ్రా.
తయారుచేసే విధానం : ముందుగా కొంత కొబ్బరిని తురిమి, మరికొంత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్లేటులో ఉంచుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో సేమ్యా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత నేతిలోనే కొబ్బరి ముక్కలు, బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్ విడివిడిగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రను స్టవ్‌పై పెట్టి అందులో బొంబాయి రవ్వ, సేమ్యా, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, చక్కెర అన్నీ వేసి, సన్నటి మంటపై ఉంచి, మందపాటి గరిటెతో వీటన్నిటినీ బాగా కలపాలి. చక్కెర కరుగుతుండగా, కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా అందులో పోస్తూ రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా కాస్త దగ్గరికి అయ్యాక నెయ్యి పైకి తేలే వరకు సన్నటి మంటపై ఉడికించాలి. ఆ తరువాత యాలకుల పొడి చల్లి బాగా కలిపి దించేయాలి. వేడి తగ్గాక, అర చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చేయాలి. ఈ లడ్డూలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి తురుములో దొర్లించి పెద్ద పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







