ఎంపీల జీతాల్లో కోత, ఏడాదిపాటు, ఎంపీల్యాడ్స్ రెండేళ్లు కట్
- April 06, 2020
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోవడంతో ఎంపీల జీతాల్లో భారీగా కోత విధించింది. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, ఎంపీల జీతాల్లో ఏడాదిపాటు 30శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఎంపీలందరి జీతాల్లో ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటు కోత విధించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అంతేగాక, రెండేళ్లపాటు ఎంపీ లాడ్స్ నిధులు కూడా మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.
ఇక మాజీ ఎంపీల పెన్షన్ లోనూ 30 శాతం కోత పడనుంది. ఈ మేరకు పార్లమెంటు సభ్యుల జీతాలు, పెన్షన్ల చట్టం-1954ను సవరిస్తూ.. సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఏడాదిపాటు 30 శాతం తక్కువ జీతం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ నిధులన్నీ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తాయని కేంద్రమంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







