NLCIL లో ఉద్యోగావకాశాలు
- April 07, 2020
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు శుభవార్త అందించింది. మొత్తం 259 ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే చాలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.nlcindia.com/ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ పోస్టులకు మార్చి 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 17 చివరి తేదీ. కాబట్టి ఆసక్తికర అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండ.
ఇక మొత్తం 259 ఖాళీలు ఉన్నాయి. అందులో మెకానికల్- 125, ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65, ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10, సివిల్- 5, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15, కంప్యూటర్- 5, మైనింగ్- 5, జియాలజీ- 5, ఫైనాన్స్- 14, హ్యూమన్ రీసోర్స్- 10 పోస్టులున్నాయి. . జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ పాస్ కావాలి.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







