మహ్‌బౌలా నుంచి విడిచి వెళ్లాలని స్పాన్సర్స్‌ ఆదేశిస్తే చట్టపరమైన చర్యలు

మహ్‌బౌలా నుంచి విడిచి వెళ్లాలని స్పాన్సర్స్‌ ఆదేశిస్తే చట్టపరమైన చర్యలు

కువైట్‌: మహ్‌బౌల్‌ ప్రాంతం నుంచి వలస కార్మికులు వెళ్ళిపోవాలని స్పాన్సర్స్‌ ఇచ్చిన ఆదేశాలపై కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ఎవరైతే, కార్మికుల్ని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపాలని చూస్తున్నారో, ఆ స్పాన్సర్స్‌ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. పోలీస్‌ ఫోర్సెస్‌ పరిస్థితిని గమనిస్తున్నారనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

Back to Top