టిసిఎస్ అద్భుత అవకాశం...
- April 08, 2020
ఢిల్లీ:భారత దేశంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ తర్వాత దేశంలోని పలు కంపెనీల విధివిధానాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం అత్యవసరంగా మారింది. ఇందుకోసమే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఒక ఉచిత కోర్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం 15 రోజుల్లో ఈ కోర్సు చేయవచ్చు. ఇప్పటికే కొంతమేరకు ఐటి సంబంధిత ప్రతిభ ఉంటే ఈ కోర్స్ ద్వారా దాన్ని మరింతగా పెంచుకోవచ్చు. టాటా గ్రూప్ సంస్థ ఈ కోర్సును పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ కోర్స్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.లాక్డౌన్ సమయంలో ఈ కోర్సును చేయవచ్చని టిసిఎస్ తెలిపింది. విద్యార్థులు మొదలుకొని ఉద్యోగార్థుల వరకు అందరూ ఈ కోర్స్ చేయవచ్చని సంస్థ తెలిపింది. ఈ కోర్సును టిసిఎస్ అయాన్(TCS iON) ప్లాట్ఫారంలో అందుబాటులో ఉంచారు.కెరీర్ ఎడ్జ్(Career Edge) పేరిట ఈ కోర్స్ ను ప్రత్యేకంగా రూపొందించారు.మరిన్ని వివరాల కోసం ఈ క్రింద లింకుని క్లిక్ చెయ్యండి. https://www.tcsion.com/LX/login
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







