పోలీసులకి మెగాస్టార్ సెల్యూట్
- April 10, 2020
హైదరాబాద్:లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. జిల్లాల బోర్డర్స్ లోనూ..రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పోలీసులు నిద్రాహారాలు మాని కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇక నిరంతరం పల్లెటూళ్ల నంచి పట్టణాల వరకూ పోలీసులు రేయింబవళ్లు పహరా కాస్తూనే ఉన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మేము సైతం అంటూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. తాజాగా ఇదే సన్నివేశాన్ని స్వయంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి పోలీసులపై తన అభిప్రాయాన్ని ట్విటర్ లో ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
`రెండు తెలుగు రాష్ర్టాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతోన్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ పోలీసుల చూస్తున్నాను. వారి పని తీరువల్ల లాక్ డౌన్ చాలా సక్సెస్ పుల్ గా జరుగుతుంది. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకూ అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతీ ఒక్కరికి వేడుకుంటున్నాను. సామాన్య జనం కూడా పోలీసులకి సహకరించి ఈ కరోనాని అంత మొందించడంలో వాళ్లకి చేదోవు..వాదోడుగా మనమందరూ సహకరించాలి. పోలీసులు చేస్తున్న ఈ అమోఘమైన ప్రయత్నానికి..వారికి ఓ పోలీసు బిడ్డగా చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్` అని చిరంజీవి ఓ వీడియా ద్వారా షేర్ చేసారు.
ఆ ట్విటర్ వీడియో చూసిన తెలంగాణ రాష్ర్ట డీజీపీ ఎమ్. మహీందర్ రెడ్డి స్పందించారు. `మీరు మాకే కాదు. మా పోలీసు ఫోర్స్ మొత్తానికి స్ఫూర్తి. పోలీసు కుటుంబానికి చెందిన సభ్యుడిగా మీ నుంచి ప్రేరణ పొందిన వారంతా చాలా విషయాలు అర్ధం చేసుకుంటున్నారు. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కునే యుద్ధంలో మీ మాటలు అందరికి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని` తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







