అందుబాటులో 2 మిలియన్‌ ఫేస్‌ మాస్క్‌లు

- April 10, 2020 , by Maagulf
అందుబాటులో 2 మిలియన్‌ ఫేస్‌ మాస్క్‌లు

మనామా: ఇండస్ట్రీ, కామర్స్‌ అండ్‌ టూరిజం మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 2 మిలియన్ల మాస్క్‌లు సూపర్‌ మార్కెట్స్‌, ఫార్మసీల్లో అందుబాటులో వున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా మాస్క్‌ల వినియోగానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో మాస్క్‌లను వీలైనంత ఎక్కువగా అందుబాటులో వుంచారు. ప్రతి ఒక్కరూ ఫేస్‌ మాస్క్‌ వినియోగించేలా అవగాహనా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కొత్త మెడికల్‌ మాస్క్‌లు ఒక్కోటి 180 ఫిల్స్‌ ధరతో అందుబాటులో వున్నట్లు మినిస్ట్రీ తెలిపింది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com