మరోసారి జీ20 మీట్
- April 10, 2020
కరోనా కారణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే అంశంపై చర్చించేందుకు జీ 20దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. మార్చి చివరలో వర్చువల్ సమావేశాలు నిర్వహించిన ఈ కూటమి ప్రపంచ మార్కెట్లోకి అత్యవసరంగా 8 బిలియన్ డాలర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. తాజాగా కరోనాను అదుపుచేసే క్రమంలో లాక్‌డౌన్లు ప్రకటించటంతో ఆర్థిక వ్యవస్థలకు ఏమేరకు నష్టం జరిగింది? మళ్లీ గాడిలో పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను చర్చించేందుకు జీ 20దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు ఎంతో కీలకమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధులుగా ఆర్థిక మంత్రి నిర్మళాసీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







