సార్క్ అత్యవసర నిధి విషయంలో పాక్ కుతంత్రం
- April 10, 2020
కరోనా సృష్టించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దక్షిణాసియా దేశాల సహకార సమాఖ్య (సార్క్) ప్రారంభించిన అత్యవసర నిధుల విషయంలోనూ పాకిస్థాన్ తన దుష్టరాజకీయం ప్రారంభించింది. సభ్యదేశాలకు అత్యవసర సాయం కోసం మార్చి 15న భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఫండ్‌ను ప్రారంభించారు. భారత్ తరఫున 10మిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. అయితే ఈ ఫండ్‌ను భారతదేశమే నిర్వహిస్తుండటంతో పాక్ రాజకీయాలకు తెరలేపింది.
సార్క్ సంస్థ ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఉంది. సంస్థ చేసే తీర్మానాలను అమలుచేయంటం, సమావేశాలను ఏర్పాటుచేయటం వంటి పనులన్నీ ఈ ప్రధాన కార్యాలయమే అమలుచేస్తుంది. అయితే మోదీ ప్రారంభించిన అత్యవసర నిధి సార్క్ తీర్మానం లేకుండా ప్రారంభించినది. ఈ నిధికి భారత్ విరాళం ఇచ్చిన తర్వాత మిగతాదేశాలు కూడా క్రమంగా ముందుకొస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ 3మిలియన్ డాలర్లను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఒక మెలికపెట్టింది. సార్క్ చాప్టర్ ప్రకారం ఏ నిధులనైనా సభ్యదేశాలతో చర్చించి ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ అత్యవసర నిధిని కూడా అదేవిధంగా అమలుచేయాని డిమాండ్ చేసింది.
పాక్ సూచనపై భారత అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. అత్యవసర సమయంలోనూ పాకిస్థాన్ భారత వ్యతిరేక వైఖరిని విడనాడటంలేదని విమర్శిస్తున్నారు. సార్క్‌లోని మరికొన్ని దేశాలు మాత్రం భారత్, పాక్ రాజకీయాలతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!