TCS ఉద్యోగులకు శుభవార్త
- April 17, 2020
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ క్యూ4 ఫలితాల సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 4.5 లక్షల తమ ఉద్యోగుల్లో ఎవర్నీ తీసివేయడం లేదని వెల్లడించింది. అయితే జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. అయితే కొత్త నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40వేల మంది నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఆరోగ్యకరమైన లాభాలను నివేదించింది. క్యూ 4లో నికర లాభం 0.8 శాతం తగ్గి రూ .8,049 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రతి షేరుకు రూ .6 తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి, కొన్ని భారీ డీల్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగులు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..