అపరిచితులతో జాగ్రత్త: దుబాయ్ స్కూల్ సూచన
- January 27, 2016
దుబాయ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్ తమ విద్యార్థుల తల్లిదండ్రులకు అపరిచితుల విషయమై సూచన చేసింది. పేరెంట్ కమ్యూనిటీకి ఓ లేఖ రాస్తూ, అందులో అపరిచితుల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు తగు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. విద్యార్థులను స్కూల్లో ఈ విషయమై అప్రమత్తం చేశామనీ, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. స్కూల్ గేట్ వద్ద ఇద్దరు అపరిచితులు విద్యార్థులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్ళారనీ, అదృష్టవశాత్తూ ఎలాంటి హానీ కలగకుండా విద్యార్థులు స్కూల్‌కి చేరుకున్నారని ఆ స్కూల్ చెప్పింది. పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ, ఎలాంటి ఫిర్యాదులూ తమకు అందలేదని అన్నారు. అయితే విద్యార్థుల భద్రత విషయంలో తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యాలూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







