'APNRT' ని ప్రారంభించిన ఎపి ముఖ్యమంత్రి
- January 27, 2016
ప్రవాస తెలుగువారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రవాస తెలుగువారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ఎన్‌ఆర్‌టీ పేరుతో ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో ఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్, యాప్‌ను ఆయన ఈరోజు ప్రారంభించారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా 97 దేశాల్లో ఉన్న ప్రవాస తెలుగువారు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటూ ఆయా గ్రామాలను అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని కోరారు.డా.రవి వేమూరి గారు ప్రసంగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ కలిసి మెలిసి పనిచేయాలని కోరుకున్నారు.త్వరలో గల్ఫ్ దేశాలు పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులు సుధాకర్ కుదరవల్లి(కువైట్),అనురాధ ఒబ్బిలిశెట్టి(యు.ఎ.ఈ),రాజ శేఖర్(Kuwait NRIs),దివాకర్(TSNV),రెడ్డయ్య చౌదరి(వ్యాపరవేత్త),ప్రసాద్(SkyNet)తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







