ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- April 21, 2020
అమెరికాలో కరోనావైరస్ విలయతాండం చేస్తున్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అక్కడి ఇప్పటికే 40 వేల మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ట్రంప్. "అదృశ్య శత్రువు నుండి దాడి, అలాగే మా గొప్ప అమెరికన్ పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున, యునైటెడ్ స్టేట్స్ లోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి నేను ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేస్తాను!" అంటూ ఆయన కాసేపటి క్రితమే చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, ఈ ఉత్తర్వుల వివరాలు ఇంకా స్పష్టంగా తెలియదు.. ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేస్తారో కూడా క్లారిటీ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







