సుదీర్ఘకాలం మనతోనే కరోనా--WHO

- April 23, 2020 , by Maagulf
సుదీర్ఘకాలం మనతోనే కరోనా--WHO

జెనీవా:మానవాళిని పీడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచంమీద సుదీర్ఘకాలం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. కొన్ని దేశాలు ఈ వైరస్‌ అదుపులోకి వచ్చిందని భావిస్తున్నప్పటికీ..కొత్తగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నామని WHO డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ వెల్లడించారు.లాక్డౌన్లు ఎత్తి వేసి తప్పు చేయొద్దు అని టెడ్రోస్ అధోనామ్ వెల్లడించారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు అనిపించినప్పటికీ.. ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో వైరస్ తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో వ్యాధి తీవ్రత తగ్గిందని భావించిన దేశాల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా వైరస్‌ని గురించి హెచ్చరికలు (జనవరి 30న) WHO ముందే చేసి అంతర్జాతీయ అత్యయిక స్థితి ప్రకటించిందని టెడ్రోస్ వెల్లడించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన కేసులు 26 లక్షలు కాగా, ఇప్పటి వరకు లక్షా 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com