ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే జైలే
- January 27, 2016
డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే ఇకపై జైలుకు వెళ్ళాల్సి రావొచ్చు 300 ఒమన్ రియాల్స్ ఫైన్ కూడా విధింపబడుతుంది. ఆ కోణంలో కొత్త రూల్స్‌ని అమల్లోకి తెచ్చేందుకు ఒమన్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెల రోజుల నుంచి 24 నెలల వరకు జైలు శిక్ష విధించేలా, అధిక మొత్తంలో ఫైన్ విధించేలా చట్టాల రూపకల్పనలో అధికారులు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు అమెండ్మెంట్స్ మజ్లిస్ అల్ షురా ఆమోదం పొంది ఉన్నాయి. 2014తో పోల్చితే ఒమన్‌లో రోడ్డు ప్రమాదాలు 2015లో 14.9 శాతం తగ్గాయి. 2014లో 6171 యాక్సిడెంట్లు జరగ్గా, 2015లో వీటి సంఖ్య 5,254కి తగ్గింది. కారు ప్రమాదాల్లో 618 మంది 2015లో చనిపోగా, 2014లో ఈ సంఖ్య 760గా ఉంది. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడానికి కఠినమైన చట్టాల్ని ఇంకా కఠినంగా అమలు చేయవలసి ఉందని అధికారిక వర్గాలు చెప్పాయి
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







