కోవిడ్ 19: సామాజిక దూరం పాటిస్తూ మక్కాలో తరావీ ప్రార్ధనలు
- April 27, 2020
సౌదీ అరేబియా:పవిత్ర రమదాన్ మాసంలోనూ మక్కా, మదీనా మసీదుల్లో కరోనా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. మక్కా మసీదులో సామాజిక దూరాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తరావీ ప్రార్థన సమయంలో భక్తులు అంతా దూరం పాటించారు. అయితే..కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మసీదులలో సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో రమదాన్ ప్రార్థనల్లో తొలి రెండో రోజులు మసీదు ప్రాంగణం చాలావరకు భక్తులు లేక బోసిపోయి కనిపించింది. మసీదు స్టాఫ్ వరకు తరావీ ప్రార్థనలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా పవిత్ర కాబా చుట్టు ఉన్న బారికేడ్లను తొలగించారు. భక్తులను అనుమతించకున్నా..మసీదు ప్రాంగణంలో వైరస్ కు చోటు లేకుండా దాదాపు 3,500 మందితో ఎప్పటికప్పుడు క్రిమిసంహారక(శానిటైజ్) చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







