ఐడెంటిటీ కార్డును పోగొట్టుకుంటే ఎలా?
- January 28, 2016
వలసదారులకు ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. అయితే విదేశాలకు వెళ్ళే సమయంలో లేదా, విదేశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఐడెంటిటీ ప్రూఫ్‌ని గనుక తమతోపాటు తీసుకురావడంలో విఫలమైతే ఏం చేయాలనేదానిపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎటువంటి ఇబ్బందులూ ఇమ్మిగ్రేషన్‌లో తలెత్తకుండా ఉండేందుకు, తమతోపాటుగా ఐడెంటిటీ ప్రూఫ్ జిరాక్స్ పత్రాలను ఉంచుకోవాలనీ, లేదా దాన్ని మొబైల్ ఫోన్లో స్కాన్ చేసి పెట్టుకోవాలని సూచించారు. ఇలాక్కూడా చేయలేని పక్షంలో, కొన్ని అవకాశాలను మినిస్ట్రీ కల్పించింది. ఆరు నెలల పరిమితిలోనే వలసదారుడు తిరిగి వస్తూ, తన వెంట ఐడెంటిటీ కార్డ్‌ని తెచ్చుకోని పక్షంలో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద రిటర్న్ వీసాను డైరెక్ట్‌గానే ఇచ్చేస్తారు. రెసిడెన్సీ కార్డ్‌ని ఇమ్మిగ్రేషన్‌లో కోల్పోయినట్లుగా మార్క్ చేస్తారు. ఒకవేళ ఆరు నెలల పరిమితి దాటిన తర్వాత తిరిగి వస్తే, ఎంప్లాయర్ లేదా స్పాన్సరర్ ద్వారా వీసా ఇప్పిస్తారు. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ కాకుండా ఉంటామని అధికారులకు హామీ ఇవ్వవలసి ఉంటుంది. స్పాన్సరర్ లేదా ఎంప్లాయర్ నుంచి వీసా పొందలేని పక్షంలో, చట్టపరమైన చర్యలకు గురవుతారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







