మక్కాలో 100 పడకల కరోనా వైరస్ ఫీల్డ్ ఆస్పత్రి ఏర్పాటు
- May 01, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ పై పోరాటంలో ఎక్కడిక్కడ ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది సౌదీ ప్రభుత్వం. ఇందులో భాగంగా మక్కా ప్రాంతంలో వంద పడకల కరోనా వైరస్ ఫీల్డ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలోని వసతులు, ఆస్పత్రి సంసిద్ధతను మక్కా ఆరోగ్య వ్యవహారాల విభాగం డైరెక్టర్ వెల్ ముత్తైర్ పరిశీలించారు. తాత్కాలిక ఆస్పత్రిలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మక్కా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..మక్కా ప్రాంతంలోని అంతగా జనసాంద్రత ఉండని, అభివృద్ధి చెందని కుడైకి సమీపంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖలోని మెడికల్ సర్వీస్ జనరల్ డిపార్ట్ మెంట్ కు చెందిన మెడికల్ సామాగ్రి సమకూర్చిందని తెలిపారు. సుశిక్షితులైన వైద్య సిబ్బంది, మక్కా ఆరోగ్యశాఖ ఆపరేట్ చేస్తుందని కూడా ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







