కోవిడ్ 19: ప్రజలు మరింత బాధ్యతగా నడుచుకోవాలి..దుబాయ్ పోలీస్ చీఫ్ సూచన

- May 01, 2020 , by Maagulf
కోవిడ్ 19: ప్రజలు మరింత బాధ్యతగా నడుచుకోవాలి..దుబాయ్ పోలీస్ చీఫ్ సూచన

దుబాయ్ :కరోనా మహమ్మారిని జయించాలంటే ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని దుబాయ్ పోలీస్ చీఫ్ లెప్టినెంట్ జనరల్ అబ్ధుల్లా ఖలీఫా అల్ మర్రి అన్నారు. దుబాయ్ లో కొన్ని ఆంక్షలు సడలించినప్పటికీ ప్రపంచంలోని మిగిలిన దేశల కంటే కరోనా వైరస్ పై సమర్ధవంతంగా పోరాడుతున్నామని ఆయన అన్నారు. అయితే..కరోనాపై పోరాటంలో ప్రజలే కీలక పాత్ర పోషించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండాలన్నారు. ఇక రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని కుటుంబ సమేత పర్యటనలపై స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అలాగే జన సమూహ కార్యక్రమాలను మానుకోవాలన్నారు.

వివిధ ప్రాంతాల్లో కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించుకున్న తర్వాతే ఆంక్షల సడలింపులపై సుప్రీం కమిటీ తగిన నిర్ణయాలు తీసుకుంటుందని దుబాయ్ పోలీస్ చీఫ్ తెలిపారు. వైరస్ పై పోరాటంలో ఇప్పటికే అల్ రస్, నైఫ్ ప్రాంతాలు గొప్ప విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు. ప్రజల స్వీయ నియంత్రణ వల్లే వైరస్ నియంత్రణ సాధ్యమైందని వివరించారు. ఎమిరాతిలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితిని విశ్లేషించుకొని మరిన్ని ఆంక్షలు విధించాలా? ఉన్న ఆంక్షలు సడలించాలా?
అనేది కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. కరోనా కారణంగానే నెలకొన్న విపత్కర పరిస్థితులపై ప్రజల్లో అవగాహన పెంచటంలో భాగంగానే జరిమానాలు విధించాల్సి వస్తోందని తెలిపారు. అయితే..కరోనాపై పోరాటంలో ప్రజల అప్రమత్తత, స్వీయ నియంత్రణ చర్యలను బేరీజు వేసుకున్నాకే సుప్రీం కమిటీ, విపత్తు నిర్వహణ అధికారులు దుబాయ్ లోని పార్కులు, బీచులను తిరిగి తెరవటంపై తగిన నిర్ణయం తీసుకుంటారని దుబాయ్ పోలీస్ చీఫ్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com