దుబాయ్ లో 'మే డే'

- May 01, 2020 , by Maagulf
దుబాయ్ లో 'మే డే'

దుబాయ్: కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎటుచూసినా మారణహోమం.గల్ఫ్ లో చూస్తే కార్మిక లోకం ఎంతో సతమతమవుతోంది. కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి రోజు గడవటం కష్టంగా మారిపోయింది. స్వదేశాలకు పయనమైపోదాం అనుకుంటే ఒకవైపు ప్రయాణ నిషేధం మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం కార్మిక సోదరులను కలచివేస్తోంది. ఇంత క్లిష్ట పరిస్థితిలో సైతం కార్మికులంతా కలిసి సాటి కార్మికులకు బాసటగా నిలిచి కలిసికట్టుగా 'మే డే' జరుపుకోవటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే...

మే డే సంధర్భంగా దుబాయ్ లోని 'బు హలీబా' కంపెనీ లో కార్మికులంతా కలిసి మే డే జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం సూచించిన భద్రతలు పాటిస్తూ 'మే డే' జరుపుకోవటం గమనార్హం.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com