కోవిడ్-19 పై జర్నలిస్టులు చేస్తున్న పోరాటం అభినందనీయం: ఉపరాష్ట్రపతి
- May 03, 2020
ఢిల్లీ:కోవిడ్-19 పై జర్నలిస్టులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మూలసూత్రాలకు మీడియా కట్టుబడి ఉండాలని ట్వీట్ చేశారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు మాత్రమే ప్రజలకు చూపించాలని.. అందులో సొంత అభిప్రాయలు జోడించవద్దని అన్నారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం ఇస్తున్న భావప్రకటనాస్వేచ్ఛను సద్వినియోగ పరుచుకుంటూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా, ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా పత్రికలు, జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అవిస్మరణీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







