ఆపదలో ఉన్న తెలుగు వారు ఎక్కడ ఉన్నా సురక్షితంగా తీసుకువస్తాం--ఉపముఖ్యమంత్రి అంజాత్ బాషా

- May 03, 2020 , by Maagulf
ఆపదలో ఉన్న తెలుగు వారు ఎక్కడ ఉన్నా సురక్షితంగా తీసుకువస్తాం--ఉపముఖ్యమంత్రి అంజాత్ బాషా

కడప:ఆపదలో ఉన్న తెలుగు వారు ప్రపంచ నలుమూలల ఎక్కడ ఉన్నా సురక్షితముగా స్వదేశానికి తీసుకొని వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాకారంతో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజాత్ బాషా షేక్ బేపారి తెలిపారు.

గల్ఫ్ దేశలలో ఎక్కువ శాతం  మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్దితులలో లాక్ డౌన్ కారణంగా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా కువైట్ లో ఎవరైతే చట్ట వ్యతిరేకంగా  ఉన్న వారిని ఎటువంటి జరిమానాలు లేకుండ ఆమ్నెస్టీ ( క్షమాబిక్ష ) ప్రకటించి 01 - 04 - 2020 నుండి 30 - 4 - 2020 వరకు టైం ఇచ్చింది కువైట్ లోని  భారత  రాయబార కార్యాలయం  అధికారుల నిర్లక్షణానికి కారణంగా చాలా మంది మన తెలుగు వారికి EC ( తాత్కాలిక పాస్ పోర్ట్ ) లు దొరక్క  చాలా అవస్ధలు పడ్డ సంగతి ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోన్ రెడ్డి కి దృష్టికి వచ్చిన వెంటనే భారత విదేశాంగ మంత్రి డా.సుబ్రహ్మణ్యం జయశంకర్ కి  లెటర్ ద్వారా  కువైట్ లో ఉన్న తెలుగు వారిని ఆదుకొని ఆమ్నెస్టీ పై వచ్చే వారిని రాష్ట్రం కు తీసుకొని వచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 

తెలుగు వారు ఎక్కడ ఉన్న అధైర్య పడవలసిన అవసరం లేదని మన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి  మిమ్మల్ని సురక్షితముగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీ స్వస్ధలాలకు పంపే ఏర్పాట్లు APNRTS( ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ ) ద్వారా చేస్తారని తెలిపారు.

APNRTS డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాలతో APNRTS చేర్మెన్ మేడపాటి వెంకట్ కేంద్ర విదేశాంగ  శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని ముఖ్యంగా కువైట్ లో ఆమ్నెస్టీ పై వచ్చే వారు కువైట్ షెల్టర్ లలో ఇబ్బందులు ఎదురుకుంటున్న విషయాన్నీ గ్రహించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో త్వరలోనే వారిని స్వదేశానికి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.ఆమ్నెస్టీ ద్వారా కువైట్ షెల్టర్ లో ఉన్న వారు +91 8500627678 వాట్సాప్ నెం: కు మీ పూర్తి వివరాలు తెలపండి వ్రాయడానికి రాని వారు వాయిస్ మెసేజ్ పెట్టండి అని తెలుపుతూ ఇప్పుడున్న విపత్కరపరిస్ధితిలలో తెలుగు వారికి అండగా నిలబడిన కువైట్ APNRTS సభ్యులకు వివిధ తెలుగు సామాజిక సంఘాలకు రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com