షార్జాలో నేటి నుంచి సెలూన్స్ ,మాల్స్, రెస్టారెంట్లు ప్రారంభం

- May 03, 2020 , by Maagulf
షార్జాలో నేటి నుంచి సెలూన్స్ ,మాల్స్, రెస్టారెంట్లు ప్రారంభం

షార్జా:లాక్ డౌన్ ఇన్నాళ్లు మూతపడిన వ్యాపార సంస్థలను ఓపెన్ చేసేందుకు షార్జా అర్ధికాభివృద్ధి విభాగం అనుమతించింది. దీంతో సోమవారం నుంచి షాపింగ్ మాల్స్, సెలూన్స్, రెస్టారెంట్లు ప్రారంభం కానున్నాయి. కానీ, కరోనా వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన అన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని షరతులు విధించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచిఉంచాలని సూచించింది. ఫుడ్ స్టోర్స్, మెడికల్ షాపులకు మాత్రం సమయ నిబంధనల

నుంచి మినహాయింపు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జారీ చేసిన సర్క్యూలర్ మేరకు...షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో మొత్తం సామర్ధ్యంలో 30 శాతానికి మించి ఏక కాలంలో వినియోగదారులను అనుమతించటానికి వీలులేదు. అలాగే ప్రవేశ ద్వారాల దగ్గర తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలపై అవగాహన పెంచేలా బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. షాపు నిర్వాహకులు వైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు తప్పనిసరిగా మాస్కులు,హ్యాండ్ గ్లౌజులు ధరించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన షార్జా అర్ధికాభివృద్ధి విభాగం అధికారులు..షార్జా మున్సిపాలిటీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. ఇదిలాఉంటే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు సంబంధించిన నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. 

షాపింగ్ మాల్స్ నిబంధనలు : అన్నిషాపింగ్ మాల్స్ వినియోగదారులపై ఖచ్చితంగా నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. మొత్తం వినియోగదారుల్లో 30 శాతానికి మించి ఒకేసారి వినియోగదారులను మాల్స్ లోకి అనుమతించకూడదు. అలాగే పార్కింగ్ సామర్ధ్యంలో కూడా 30 శాతం దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. వాలెట్ పార్కింగ్, కార్ వాషింగ్ సర్వీసులపై పూర్తి నిషేధాన్ని పాటించాల్సిందే. ఇక 60 ఏళ్లకు పైబడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్స్ లోకి అనుమతించకూడదు.

షాపులో క్రిమిసంహారక చర్యల్లో భాగంగా క్లీనర్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మాల్స్ ప్రాంగణాన్ని తరచుగా శుభ్రంగా చేస్తుండాలి. టాయిలెట్స్ ఎలివేటర్స్, మెట్లు, లిఫ్టులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేయాల్సిందే. ప్రతి షాపింగ్ మాల్ లో థర్మల్ స్క్రీనింగ్ తో వినియోగదారులను పరీక్షించటంతో పాటు.. శానిటైజర్స్ చేతులు శుభ్రం చేసుకున్నాకే మాల్స్ లోకి అనుమతించాలి.

రెస్టారెంట్ లో పాటించాల్సిన నిబంధనలు : రెస్టారెంట్లలో మొత్తం సీటింగ్ కెపాసిటీలో 30 శాతానికి మించకుండా వినియోగదారులను అనుమతించాల్సి ఉంటుంది. ప్రతి టేబుల్ మరో టేబుల్ మధ్య దూరం కనీసం 2 మీటర్ల దూరంలో ఉంచాలి. ఒక్కో టేబుల్ కు నలుగురిని మాత్రమే అనుమతించాలి.

సెలూన్స్: సెలూన్స్ నిర్వాహకులు ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాకే కస్టమర్లకు సర్వీస్ అందించాల్సి ఉంటుంది. అలాగే కరోనా కట్టడికి చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలను విధిగా పాటించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com