యూఏఈ: కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచిన భారత సామాజిక కార్యకర్త

- May 03, 2020 , by Maagulf
యూఏఈ: కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచిన భారత సామాజిక కార్యకర్త

అబుధాబి: కరోనాతో పోరాడి ప్రాణాలు వదిలిన భారత సామాజిక కార్యకర్త. ఈ వార్త విన్న ఇండియన్ కమ్యూనిటీ దిగ్భ్రాంతికి లోనయింది. వివరాల్లోకి వెళితే..

"రెండు వారాల క్రితం కరీం హాజీ జ్వరం, దగ్గు తో బాధపడ్డారు. మేము వెంటనే నాన్నను స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్ళాము. వైద్యుడు శ్వాబ్ టెస్ట్ చెయ్యగా కరోనా ఉన్నట్టు నిర్ధారించారు. వెంటనే నాన్నను అబుధాబిలోని బుర్జీల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 రోజులు ఆసుపత్రిలో కరోనాతో పోరాడారు. నాన్న 14-15 సంవత్సరాలుగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు.  దురదృష్టవశాత్తు దీంతో నాన్న పరిస్థితి మరీ క్షీణించింది. చివరి రెండు రోజులు వెంటిలేటర్‌ పైనే ఉన్నారు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు పి.కె. కరీం హాజీ కుమారుడు మహ్మద్ అబ్దుల్ గఫూర్.

యూఏఈ లో కరోనా విజృభిస్తుండటంతో ఆహారం అవసరమైన వారికి ఆహారం అందించే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తూ యూఏఈ యొక్క జాతీయ స్టెరిలైజేషన్ డ్రైవ్ తరువాత ఎమిరేట్‌లో ఆహారం అవసరం ఉన్న 1,000 మందికి ఆహారం అందించే బాధ్యత పి.కె. కరీం హాజీ వహించటం జరిగింది. అంతేకాదు జాతీయ స్టెరిలైజేషన్ డ్రైవ్ సందర్భంగా రాజధానిలోని కార్మికులకు రోజువారీ భోజనం అందించడానికి రెస్టారెంట్లతో కలిసి పనిచేశారు. ఆయన అందించిన ఈ సహాయానికి ప్రతిఒక్కరి అభిమానాన్ని హాజీ చూడగొన్నారు. 

62 ఏళ్ళ పి.కె. కరీం హాజీ, ఫిబ్రవరి 20, 1974 న యూఏఈ రావటం జరిగింది. యూఏఈ ఎయిర్ఫోర్స్ (అబుధాబి) లో డ్రైవర్ గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత హాజీ ముస్సాఫాలో తన సొంత సూపర్ మార్కెట్ ప్రారంభించడానికి వ్యాపార లైసెన్స్ తీసుకొని ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు. హాజీ కు ఒక భార్య, ముగ్గురు కుమారులు మరియు నలుగురు మునుమనవళ్లు. అబుధాబి కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (KMCC) మాజీ అధ్యక్షుడు, ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ మరియు సున్నీ సెంటర్‌ లో చురుకైన కమ్యూనిటీ వర్కర్ గా అందరి మన్నలను అందుకున్నారు. 

హాజీ మృతికి అబుధాబి KMCC అధ్యక్షుడు షుకూర్ అలీ కల్లుంగన్, మరియు పలువురు ఉన్నతాధికారులు హాజీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com