బహ్రెయిన్: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్...

- May 03, 2020 , by Maagulf
బహ్రెయిన్: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్...

మనామా:లాక్ డౌన్ ఆంక్షలతో మెడిసిన్ కోసం ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వారి బాధలు తొలిగిపోనున్నాయి. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇక నుంచి ఇంటికే మందులను సరఫరా చేయాలని అంతర్గత, సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మందులను ఇంటికి తీసుకురమ్మంటే ఇంటికి, లేదంటే వారు పని చేసే ఆఫీసు దగ్గరకి తీసుకొచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆయా మంత్రిత్వ శాఖల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఉద్యోగుల సేవలను వినియోగికోనున్నట్లు వెల్లడించింది. 'మీ ఆరోగ్యమే పెన్నిధి' అనే థీమ్ తో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో భాగంగా డోర్ డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టారు. అబుదాబిలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com