కోవిడ్ 19: దమామ్ లోని రెండో పారిశ్రామిక వాడ దిగ్బంధం

- May 03, 2020 , by Maagulf
కోవిడ్ 19: దమామ్ లోని రెండో పారిశ్రామిక వాడ దిగ్బంధం

సౌదీ అరేబియా:కరోనా వైరస్ కట్టడిలో తొలి నుంచి పకడ్బందీ చర్యలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం..వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా దమామ్ ప్రాంతంలోని రెండో పారిశ్రామిక వాడను పూర్తిగా దిగ్బంధం చేసింది. ఇక నుంచి పారిశ్రామిక వాడ ప్రాంతానికి ఎవరిని అనుమతించబోమని, అలాగే ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్లనివ్వబోమని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ ప్రబలకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే..సరుకు రవాణా వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుందని, అలాగే కీలక కర్మాగారాల్లో పని చేసే ఉద్యోగులకు కూడా అనుమతి ఉంటుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com