ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం..
- January 28, 2016
'లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం' వార్తలు ముంబై వాసులను కాసేపు హడలగొట్టేశాయి. వేలమంది జనం, సాయుధ రైల్వే పోలీసుల నడుమ రైల్వే స్టేషన్ లో చిరుతపులి సంచారం సాధ్యమేనా? అనుకుంటూ యధావిధిగా స్టేషన్లకు వెళ్లినవారికి నిజంగానే పులల చిత్తరువులు కనిపించాయి.ఖర్, బోరీవ్యాలీ లోకల్ స్టేషన్ ఫ్లాట్ ఫామ్ మెట్లపై ఠీవిగా నిల్చున్న చిరుతపులి బొమ్మలు చూసి అవాక్కయిన ప్రయాణికులు.. వాటిని గీసినవాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంత అందంగా కుదిరాయా చిత్తరువులు. ఒక్క చిరుతపులేకాదు జీబ్రా, ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని చెట్లు తదితర బొమ్మలు స్టేషన్ గోడలపై అలరిస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేందుకు మేక్ ఎ డిఫరెన్స్(ఎంఏడీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ చిత్తరువుల పనిని చేపట్టింది.ఒక్క రైల్వే ష్టేషన్లేకాక నేషనల్ హైవేలు, బీచ్ లు, పార్కుల వంటి పబ్లిక్ ప్లేసెస్ లోనూ అందమైన బొమ్మలు ఫ్రీగా గీసిపెట్టేందుకు సిద్ధమవుతోంది ఎంఏడీ. ఖర్, బోరీవ్యాలీ స్టేషన్లలో కనువిందు చేస్తోన్న ఈ చిత్రరాజాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







