హైకింగ్ ట్రిప్: వలసదారుడి దుర్మరణం
- May 11, 2020
ఖోర్ ఫక్కన్ మౌంటెయిన్స్ ప్రాంతంలో ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన ఓ వలసదారుడు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ముగ్గురు ట్రెక్కింగ్ కోసం వెళ్ళగా, 35 ఏళ్ళ వలసదారుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుతు తెలిపారు. ఇద్దరు మహిళల్ని మాత్రం అధికారులు రక్షించారు. షార్జా సివిల్ డిఫెన్స్, నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ నుంచి ఎయిర్ టీమ్స్ రంగంలోకి దిగి ముగ్గురి ఆచూకీ కనుగొన్నారు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 33 ఏళ్ళ మహిళ బెలారస్ కి చెందినవారు. మరో 33 ఏళ్ళ మహిళ లాత్వియాకి చెందినవారు. 35 ఏళ్ళ వ్యక్తి అరబ్ జాతీయుడు. మహిళల్ని ఆసుపత్రికి తరలించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచన మేరకు డెడ్ బాడీకి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వుండాలనీ, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







