బహ్రెయిన్:వ్యక్తిగత తగాదాలతో సోదరుడిపై దాడి..మూడో అంతస్తుపై నుంచి నెట్టివేత
- May 12, 2020
మనామా:మూడో అంతస్తు నుంచి వ్యక్తిని తోసివేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఈ నెల 31న క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సోదరుల మధ్య తలెత్తిన వ్యక్తిగత వివాదంలో ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని మూడో అంతస్తు నుంచి తోసివేశారనే ఆరోపణలతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే..బాధితుడు గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో బాధితుడితో ఉన్న అతని స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం..తాము తమ ఫ్లాట్ లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బలవంతంగా తమ ఫ్లాట్ లోకి చొచ్చుకొచ్చారని, వాళ్లు అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు అతను చెబుతున్నాడు. ఫ్లాట్ లోకి చొచ్చుకొచ్చిన వెంటనే దాడికి ప్రయత్నించటంతో బాధితుడు పై అంతస్తులోకి పారిపోయాడని..అతనిని వెంబడించిన నిందితులు మూడో ఫ్లోర్ కు చేరుకోగానే అక్కడి నుంచి అతన్ని కిందకు తోసివేసినట్లు చెబుతున్నాడు. అంతేకాదు..దాడి జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా వెల్లడించాడు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు బాధితుడికి సోదరుడని..ఆస్తి తగాదా విషయంలో దాడి జరిగినట్లు వెల్లడించాడు. బాధితుడి స్నేహితుడి ఫిర్యాదుతో నిందితులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి న్యాయవిచారణకు సిఫార్సు చేశారు. ఈ కేసులో ఈ నెల 31న క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







