కరోనా వైరస్: పోస్ట్ రమదాన్ రీ-ఓపెనింగ్ ప్లాన్
- May 12, 2020
దుబాయ్:పోస్ట్ రమదాన్ రి-ఓపెనింగ్ ప్లాన్‌ని మాల్స్, కార్యాలయాల కోసం ఖరారు చేసింది దుబాయ్. మాల్స్ మరియు కార్యాలయాల్లోకి 12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన పెద్దవారి ప్రవేశాన్ని నిషేధించారు. గూడ్స్ రిటర్న్ లేదా ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి వస్తే, వాటిని శానిటైజ్ చేయడంతోపాటు, 24 గంటలు వాటిని విడిగా వుంచి, ఆ తర్వాత మాత్రమే వాటిని డిస్‌ప్లేలో పెట్టాల్సి వుంటుంది. సేల్స్ అండ్ ప్రమోషన్స్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తారు. 30 శాతం సామర్థ్యంతో అలాగే 2 మీటర్ల దూరం టేబుల్స్ మధ్య పాటించే రెస్టారెంట్స్ తెరచుకోవచ్చు. ఫిటింగ్ రూవ్‌ులో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం వుండకూడదు. ఆ రూమ్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వుంటుంది. కార్యాలయాల పని సమయం రమదాన్ నేపథ్యంలో ఆరు గంటేల వుంటుంది. 30 శాతం వర్క్ ఫోర్స్‌తోనే కార్యాలయాలు నడవాల్సి వుంటుంది. ఎలివేటర్స్ 30 శాతం కటే ఎక్కువ నిండకూడదు. కిచెన్స్, పాంట్రీస్ తెరచి వుంటాయి. డిస్పెజబుల్ కట్లెరీ వినియోగం తప్పనిసరి. వాటర్ మెషీన్స్ వినియోగానికి అనుమతి లేదు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







