తెలంగాణ:మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- May 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,414 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 428 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు అధికారులు.. ఇక, ఇవాళ 13 మందిని డిశ్చార్జ్ చేయగా.. డిశ్చార్జి అయినవారి సంఖ్య 952కి చేరింది.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది.. ఇవాళ ఒకే రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 40 కొత్త కేసులు వెలుగు చూడగా.. రంగారెడ్డి జిల్లాలో ఐదు కేసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇద్దరికి.. మొత్తంగా 47 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







