చైనా నుండి మరో వైరస్ ఇండియాను తాకింది!
- May 15, 2020
ఒకవైపు కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంటే.. మరోవైపు ఇంకో కొత్త వైరస్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఫ్లూను అధికారులు గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. దీనితో ఆక్కడి ప్రభుత్వం వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేలా పందులను సామూహికంగా చంపేందుకు సిద్ధమవుతోంది. అది కూడా కేవలం వైరస్ సోకిన వాటినే చంపాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే సుమారు పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. అటు పందుల పెంపకం చేసే రైతులకు 144 కోట్ల రూపాయల వన్ టైమ్ ఫైనాన్షియల్ ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది.
రాష్ట్రంలో పెరుగుతోన్న ఈ సంక్షోభం తీవ్ర ఆందోళనను కలగజేస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 10 జిల్లాలకు వ్యాపించింది. దాదాపు 14,919 పందులు చనిపోయాయి. తాము ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దేశీయ పందులకు ప్రాణాంతకం, దాదాపు 100 శాతం మరణాల రేటు ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా వ్యాపించింది. ఈ వ్యాధి జంతువుల నుండి జంతువులకే వ్యాపిస్తుందని.. మనుషులకు వ్యాప్తి చెందదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాధి భారత్‌లో వ్యాపించడం తొలిసారి కాగా.. చైనా నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అస్సాం మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







