దుబాయ్ మాల్ ఫౌంటేన్ లో తిమింగలం..సోషల్ మీడియాలో వైరల్
- May 18, 2020
దుబాయ్:లాక్ డౌన్ బోర్ ఫీలవుతున్న దుబాయ్ లైఫ్ స్టైల్ లో ఓ సర్ ప్రైజ్ . దుబాయ్ మాల్ ఫౌంటేన్ లో డాల్ఫిన్ విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను దుబాయ్ మాల్ ప్రాపర్టీ డెవలపర్ ఎమార్ రిలీజ్ చేసింది. 'దేని కోసం మీ ఎదురుచూపులు..దుబాయ్ మాల్ మరిన్ని సర్ ప్రైజ్ లతో సిద్ధంగా ఉంది' అనే క్వాప్షన్ తో వీడియో షేర్ చేశారు. అయితే..వీడియోను షేర్ చేసిన గంటలోనే వైరల్ గా మారిపోయింది. ఏకంగా 40 వేల క్లిక్స్ వచ్చాయి. లాక్ డౌన్ దుబాయ్ ని మిస్ అవుతున్న జనాలు నెట్ లో ఈ వీడియోను చూసి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ ని మిస్ అవుతున్నాను..ఏదో రోజు నేని తిరిగి వచ్చేస్తాను అంటూ ఒక నెటిజన్ తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు. అయితే..చిన్న పిల్లలు కూడా వస్తారు కనుక..తిమింగలం లాంటివి ఫౌంటేన్ లో ఉంచటం మంచిది కాదంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. ఏదేమైనా ఈ 10 సెకన్ల వీడియో దుబాయ్ లవర్స్ కు కాస్తంతా రిలీఫ్ ఇస్తోంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







