కువైట్:మాస్కులు ధరించకుంటే 3 నెలల జైలుశిక్ష..5000 KD జరిమానా

- May 18, 2020 , by Maagulf
కువైట్:మాస్కులు ధరించకుంటే 3 నెలల జైలుశిక్ష..5000 KD జరిమానా

కువైట్:కరోనా కట్టడిలో భాగంగా కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మాస్కులు ధరించకుంటే జైలుశిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ డిసిషన్‌ నెంబర్‌ 83/2020ను జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరు ముక్కు, మూతి కవర్‌ అయ్యేలా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఒకవేళ ఎవరైనా మాస్కులు ధరించకుంటే..3 నెలల జైలు శిక్ష, 5000 KD మించకుండా జరిమానా లేదంటే జైలు శిక్ష, జరిమానా రెండు విధించొచ్చని కువైట్‌ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com