స్పాన్సర్‌ కుమార్తెను ముద్దాడేందుకు యత్నించిన హౌస్‌ వర్కర్‌కి జైలు

- May 18, 2020 , by Maagulf
స్పాన్సర్‌ కుమార్తెను ముద్దాడేందుకు యత్నించిన హౌస్‌ వర్కర్‌కి జైలు

మనామా:ఓ హౌస్‌ వర్కర్‌, తన స్పాన్సర్‌ కుమార్తెను ముద్దాడేందుకు యత్నించిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో, ఆమెను ముద్దాడేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. నిందితుడు ఆసియా జాతీయుడిగా గుర్తించారు. ఏప్రిల్‌ 5న ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం బాధితురాలి తండ్రి అయిన స్పాన్సర్‌ బయటకు వెళ్ళగా, నిందితుడు నీఛమైన పనికి ప్రయత్నించాడు. బాధితురాలి గదిలోకి నిందితుడు చొచ్చుకుని వెళ్ళి ఆమెను ముద్దాడేందుకు యత్నించగా, బాధితురాలు చాకచక్యంగా నిందితుడి దుశ్చర్య నుంచి తప్పించుకుంది. తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com