కోవిడ్‌ 19: ఒకే రోజు 3,334 కర్‌ఫ్యూ ఉల్లంఘనలు

- May 18, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: ఒకే రోజు 3,334 కర్‌ఫ్యూ ఉల్లంఘనలు

రియాద్: సౌదీ సెక్యూరిటీ ఏజెన్సీస్‌, ఒకే రోజు 3,334 కర్‌ఫ్యూ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో కర్‌ఫ్యూని అమల్లోకి తీసుకురాగా, ఒకే రోజు భారీ యెత్తున ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. క్యాపిటల్‌ రియాద్‌లో 1,845 ఉల్లంఘనలు నమోదు కాగా, పవిత్ర మక్కా నగరంలో 281, ఈస్టర్న్‌ ప్రావిన్స్‌లో 277 ఉల్లంఘనలు నమోదయినట్లు తెలుస్తోంది. కాగా, సౌదీ అరేబియాలో ఇప్పటిదాకా 52,016 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 302 మంది మృత్యువాత పడ్డారు కరోనా కారణంగా.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com