స్పాన్సర్ కుమార్తెను ముద్దాడేందుకు యత్నించిన హౌస్ వర్కర్‌కి జైలు
- May 18, 2020
మనామా:ఓ హౌస్ వర్కర్, తన స్పాన్సర్ కుమార్తెను ముద్దాడేందుకు యత్నించిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో, ఆమెను ముద్దాడేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. నిందితుడు ఆసియా జాతీయుడిగా గుర్తించారు. ఏప్రిల్ 5న ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం బాధితురాలి తండ్రి అయిన స్పాన్సర్ బయటకు వెళ్ళగా, నిందితుడు నీఛమైన పనికి ప్రయత్నించాడు. బాధితురాలి గదిలోకి నిందితుడు చొచ్చుకుని వెళ్ళి ఆమెను ముద్దాడేందుకు యత్నించగా, బాధితురాలు చాకచక్యంగా నిందితుడి దుశ్చర్య నుంచి తప్పించుకుంది. తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







