నేటి నుంచి వెహికిల్స్‌ విండ్‌ షీల్డ్స్‌పై నో పేపర్‌ పార్కింగ్‌ టిక్కెట్స్‌

- May 18, 2020 , by Maagulf
నేటి నుంచి వెహికిల్స్‌ విండ్‌ షీల్డ్స్‌పై నో పేపర్‌ పార్కింగ్‌ టిక్కెట్స్‌

దుబాయ్:వాహనదారులు ఇకపై విండ్‌ షీల్డ్స్‌పై పేపర్‌ పార్కింగ్‌ టిక్కెట్స్‌ నేటి నుంచి డిస్‌ప్లే చేయాల్సిన అవసరం లేదని దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ స్పష్టం చేసింది. పార్కింగ్‌ మెషీన్స్‌, ఇంటరాక్టివ్‌ టచ్‌ స్క్రీన్స్‌తో అప్‌డేట్‌ చేయబడ్డాయనీ, వినియోగదారుడు తన వాహనం తాలూకు ఇన్ఫర్మేషన్‌ని ఎంటర్‌ చేసిన తర్వాత ఇ-టికెట్‌ పొందవచ్చునని ఆర్‌టిఎ పేర్కొంది. ఇంటరాక్టివ్‌ పార్కింగ్‌ మీటర్స్‌పై ఆర్‌టిఎ తన కొత్త ప్లాన్‌ని జనవరిలో ప్రకటించిన విషయం విదితమే. స్మార్ట్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కోణంలో ఈ ప్లాన్‌ని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2022 నాటికి పూర్తిస్థాయిలో ఈ పార్కింగ్‌ మీటర్స్‌ అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్‌టిఎ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com