ముగ్గురు ఆసియా జాతీయుల అరెస్ట్
- May 18, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ నిర్వహిస్తోన్న క్వారెంటైన్ సెంటర్స్ వద్ద వలసదారులకు రకరకాల వస్తువుల్ని విక్రయిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, ఈ వీడియో నేపథ్యంలో విచారణ జరిపి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు వ్యక్తులూ ఓ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన వాహనంలో వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. వస్తువుల్ని తీసుకొచ్చి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







