వర్క్ ఫ్రం హోం.. వద్దే వద్దు: సత్య నాదెళ్ల

- May 18, 2020 , by Maagulf
వర్క్ ఫ్రం హోం.. వద్దే వద్దు: సత్య నాదెళ్ల

అమెరికా:వర్క్ ఫ్రం హోం.. కొన్ని రోజులు బాగానే ఉంటుంది కానీ దీర్ఘకాలం ఇలాగే కొనసాగిస్తామనడం అస్సలు మంచిది కాదంటున్నారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. సబంధిత వర్క్ విషయమై ఆన్‌లైన్‌లో మాట్లాడుకునేదానికి, ఆఫీసులో సమావేశమైన దానికి తేడా ఉంటుందన్నారు. అంతే కాకుండా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడితే సమాజంలో కలవలేని పరిస్థితులు తలెత్తుతాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. కంపెనీలు కూడా తమ వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల కోసం చాలా నియమ నిబంధనలు మార్చుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com