ముగ్గురు ఆసియా జాతీయుల అరెస్ట్‌

- May 18, 2020 , by Maagulf
ముగ్గురు ఆసియా జాతీయుల అరెస్ట్‌

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ నిర్వహిస్తోన్న క్వారెంటైన్‌ సెంటర్స్‌ వద్ద వలసదారులకు రకరకాల వస్తువుల్ని విక్రయిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో కూడా సర్క్యులేట్‌ అవుతోంది. క్రిమినల్‌ సెక్యూరిటీ సెక్టార్‌, ఈ వీడియో నేపథ్యంలో విచారణ జరిపి, నిందితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ముగ్గురు వ్యక్తులూ ఓ కాంట్రాక్ట్‌ కంపెనీకి చెందిన వాహనంలో వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. వస్తువుల్ని తీసుకొచ్చి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com