ఏ.పి:గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు
- May 20, 2020అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. తాజా కేసులతో ఏపీలో 24 వందలు దాటాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68 కొత్త కేసులు నమోదు అయ్యాయి..ఒకరు మృతిచెందారు.. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 53 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది ప్రభుత్వం.. కొత్తగా వచ్చిన 68 పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!