:రాజకీయం జాతీయం:

:రాజకీయం జాతీయం:

:రాజకీయం జాతీయం:
                        --డా.కోడి రామ(అల్ అయిన్,యూ.ఏ.ఈ)  

ఎన్నికలొచ్చాయి,ఎలుకలన్నీ 
ఏనుగులయ్యాయి!
ఏరుగా పారెను సారాయి,
'ఓట్లు' కోసం నోట్లు,
నోట్ల కోసం ఓట్లు!
ఎందుకు పనికి రాణి ప్రజాస్వామ్యం,
నోటంటె ఓటు,చట్ట సభలో సీటు,
రాజు కావాలని రోజు,రోజు కలలు,
ఎన్నికలలో?ఎన్నికలలో!
పట్ట పగలే దోపిడి దొంగలున్న,
నిరక్షరాశ్యత నిండిన భారతం,
నిత్యం హత్యలు,నిలువు దోపిడీల భాగోతం 
రేపటి కెన్నో 'రేపు'ల రాద్దాతం 
నోట్ల కట్టలతో,ఓట్లు కొనే బడా బాబులు,
నోట్ల కోసం ఓట్లమ్ముకునే చోఠా షరాబులు!
రాజకీయం రమణీయం 
జాతీయం మరెంతో కమనీయం!
ఎన్నికలలో-ఎన్నికలలో! 

 

Back to Top