భారత్ లో డొమెస్టిక్ ప్రయాణం..అనుసరించాల్సిన మార్గదర్శకాలు
- May 21, 2020
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే, దేశీయ విమాన సర్వీసులను ఈనెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి నిన్న ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. ఇక విమాన ప్రయాణీకులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ త్వరలో వెల్లడించనుందని తెలిపారు. ఈ క్రమంలో రాకపోకల విషయంలో ప్రయాణికులు పాటించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది.
ప్రయాణికులు పాటించాల్సిన విధివిధానాలు
* ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.
* రెండు గంటలకు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సిఉంటుంది.
* రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా, ప్రైవేటు టాక్సీలను అందుబాటులో ఉంచాలి.
* 14 ఏళ్ల లోపు పిల్లలు మినహా ఆరోగ్య సేతు యాప్ ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. లేనియెడల వారిని ఎయిర్పోర్ట్ లోకి అనుమతించరు.
* ప్రయాణీకులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు వ్యక్తిగత, ఎంపిక చేసిన క్యాబ్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
* ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్కులు, గ్లోవ్స్ ధరించాలి.
* ప్రవేశ ద్వారాలు, స్క్రీనింగ్ జోన్లు, టెర్మినల్స్ వద్ద కనీసం మీటరు దూరం పాటించాలి.
* ప్రవేశద్వారాల వద్ద బ్లీచులో నానబెట్టిన మ్యాట్లు, కార్పెట్లు పరచాలి.
* కౌంటర్ల వద్ద ఫేస్‌షీల్డులు లేదా ప్లెక్సీగ్లాసు ఉపయోగించాలి.
* సీటింగ్ విషయంలో భౌతిక నిబంధనలు తప్పక పాటించాలి.
* ఎయిర్ పోర్ట్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి.
* అరైవల్, డిపార్చర్ సెక్షన్ల వద్ద ట్రాలీలకు అనుమతి లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో రసాయనాల పిచికారీ చేసిన తరువాత మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది.
* ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ముందే బ్యాగేజీని శానిటైజ్ చేసేందుకు ఆపరేటర్లు ఏర్పాట్లు చేయాలి.
* ప్రయాణికులు గుంపులు గుంపులుగా లోపలకు రావడం నిషిద్ధం.
* లాంజ్‌లు, టర్మినల్ బిల్డింగుల వద్ద న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు అందుబాటులో ఉండవు.
* జ్వరం, శ్వాసకోశ సమస్యలు, దగ్గుతో బాధపడుతున్న ఉద్యోగులను ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు.
* విమానం దిగిన తర్వాత బ్యాచ్‌ల వారీగా క్రమపద్ధతిని అనుసరించి ప్రయాణీకులు ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లాలి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







