కువైట్ నుంచి విజయవాడ బయల్దేరిన విమానం
- May 21, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ కార్యక్రమం క్రింద ఏపీ వలస కార్మికులతో విమానం ఈ రోజు కువైట్ నుండి సాయంత్రం 4.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఎంపీల నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ కి పదే పదే ఇమెయిల్స్ పంపడంతో, ఫలితంగా మొత్తం 145 మంది ప్రయాణికులతో మొదటి విమానం కువైట్ నుండి బయల్దేరింది. స్టేట్ కోవిడ్-19 నోడల్ టీం యొక్క జిల్లా రిసెప్షన్ బృందాలు విమానాశ్రయంలో ఈ వలస కార్మికులను రిసీవ్ చేసుకుంటాయి.వారిని తప్పనిసరి క్వారంటైన్ కు పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాయి.రాబోయే రోజుల్లో ఆమ్నెస్టీ కింద ఉన్న వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్న అనేక విమానాలలో ఇది మొదటిది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







