నితిన్ వినాయక్ డైరెక్షన్ లో..
- January 30, 2016
దిల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సాధించారు నితిన్, వినాయక్. ఈ సినిమా హీరోగా నితిన్ కు మాస్ ఇమేజ్ తీసుకువస్తే, దర్శకుడిగా వినాయక్ కు స్టార్ స్టేటస్ అందించింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందంటూ వార్తలు వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే అఖిల్ సినిమాతో మరోసారి వినాయక్, నితిన్ లు కలిసి పనిచేశారు.నితిన్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో అక్కినేని నటవారసుడు వెండితెరకు పరిచయం అయ్యాడు. హీరోగా నితిన్ కు మంచి బ్రేక్ ఇచ్చిన వినాయక్, నిర్మాతగా మారి చేసిన సినిమాకు మాత్రం నిరాశపరిచాడు. దీంతో నిర్మాతగా నితిన్ తొలి ప్రయత్నమే నష్టాలు మిగిల్చింది.ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చేందుకు రెడీ అవుతున్నాడు వినాయక్.ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న వినాయక్, ఆ సినిమా తరువాత నితిన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ సినిమా తరువాత, నితిన్ ఫ్యామిలీతో కలిసి కనిపించని వినాయక్ తాజాగా స్పీడున్నోడు సెట్ కు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి వచ్చాడు. దీంతో నితిన్, వినాయక్ ల సినిమా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా నితిన్ తన సొంత బ్యానర్ పై నిర్మించాడనికి రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







