రియాద్:కష్ట కాలం త్వరలో తొలగిపోతుంది
- May 25, 2020
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు. డిప్యూటీ ప్రిమియర్ అలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కూడా అయిన క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, వర్చువల్ విధానంలో అధికారులతో భేటీ అయ్యారు. డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ ఖాలిద్ ఇన్ సల్మాన్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కి చెందిన సీనియర్ అధికారులు, మినిస్ట్రీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ముస్లిం సోదరులు ఆనందంగా వేడుకలు జరుపుకోలేకపోయారని చెప్పారు క్రౌన్ ప్రిన్స్. ‘త్వరలోనే ఈ కష్ట కాలం తొలగిపోతుంది.. అల్లా ఆశీర్వాదంతో మళ్ళీ మనమంతా ఆనందమయమైన జీవితాన్ని గడుపుతాం..’ అని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







