తెలంగాణ:కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
- May 29, 2020
తెలంగాణ:కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి కలిసి సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ వద్ద మోటార్ స్వీచ్‌లను ఆన్ చేయడంతో నీరు వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా గంగపూజ నిర్వహించి గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లో కలిపారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిషృతమైంది.
దీంతో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగవ లింక్ 14వ ప్యాకేజీలో భాగంగా దీన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ యాదాద్రి జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. దీంతో ఆయా జిల్లాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతకు ముందు సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు,ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







