షెడ్యూల్డ్, ట్రాన్సిట్ విమానాల కార్యకలాపాలకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సంసిద్ధం
- May 29, 2020
దుబాయ్: దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, షెడ్యూల్డ్ విమానాలు అలాగే ట్రాన్సిట్స్ విమానాల కార్యకలాపాలకు కొత్తగా అమల్లోకి తెచ్చిన సేఫ్టీ మెజర్స్ ద్వారా నిర్వహించేందుకు సంసిద్ధంగా వున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ సీఈఓ జమాల్ అల్ హాయి ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రావెలర్స్ కోసం రెస్టారెంట్లు, కేఫ్‌లు ఇతర షాప్‌లు అందుబాటులో వుంటాయని చెప్పారు. ప్రొటెక్టివ్ గ్లాస్‌ని ఆయా ఫెసిలిటీస్‌లో ఏర్పాటు చేశారు. బాడీ హీట్ డిటెక్టర్స్ సహా సోషల్ డిస్టెన్సింగ్‌కి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, గతంలోలా ఎలాంటి భయాలూ లేకుండా ప్రయాణీకులు పూర్తి స్వేచ్ఛతో ప్రయాణాలు కొనసాగించడానికి కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నేపధ్యంలో విధించిన ఆంక్షల నుంచి ఇప్పుడిప్పుడే సడలింపులు చోటు చేసుకుంటున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







